Header Banner

చిరిగిన నోట్లు ఉన్నాయా? ఎలా మార్చుకోవాలో తెలుసా? RBI కొత్త రూల్స్ ఇవే!

  Tue Feb 18, 2025 09:00        India

చిరిగిపోయిన కరెన్సీ నోటు ఇస్తే ఎవరూ తీసుకోరు. అవి చెల్లవని చెప్పి రిజెక్ట్ చేస్తుంటారు. కరెన్సీ నోటుకు కూడా లైఫ్ స్పాన్ ఉంటుంది. అయితే ఎక్కువగా వాడిన నోట్లు చిరిగిపోవడం లేదా ఇంకేవిధంగానైనా డ్యామేజ్ కావడం కామన్. అయితే వాటిని బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. పైగా ఎలాంటి కమిషన్‌ ఇవ్వాల్సిన అసవరం లేదు. డ్యామేజ్‌ అయిన కరెన్సీ నోట్లను తీసుకొని వాటి స్థానంలో కొత్తవి ఇవ్వాలని ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ క్లియర్‌గా చెబుతున్నాయి. 

 

పాత, చిరిగిన, డ్యామేజ్‌ అయిన కరెన్సీ నోటును దగ్గర్లో ఉన్న ఏ పబ్లిక్‌, ప్రైవేట్‌ బ్యాంకులోనైనా ఎక్స్‌ఛేంజ్‌ చేసుకోవచ్చు. వాటిని తీసుకొని కొత్త నోట్లను ఇవ్వడం బ్యాంకుల బాధ్యత. కాబట్టి ఏ బ్యాంకు కూడా మీ రిక్వెస్ట్‌ను తిరస్కరించలేదు. ఒక్క నోటున్నా లేదా పెద్ద కట్టే ఉన్నా, ఎలాంటి ఫీజు తీసుకోకుండా వాటిని ఎక్స్‌ఛేంజ్ చేయాల్సిందే. 

 

ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ ఇవే.. డ్యామేజ్‌ అయిన కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు ఆర్‌బీఐ కొన్ని రూల్స్‌ సెట్‌ చేసింది. వీటిలో మొదటిది నోట్ల సంఖ్య. ఒక్కసారి 20 నోట్లకు మించి ఎక్స్‌ఛేంజ్‌ చేసుకోవడం కుదరదు. అంటే ఒక్కసారి 20 నోట్ల కంటే ఎక్కువ పొందడానికి వీలుపడదు. 

 

వాల్యూ లిమిట్: ఒకసారి ఎక్స్‌ఛేంజ్‌ చేసుకునే నోట్ల విలువ రూ.5,000 దాటొద్దు. ఉదాహరణకు మీరు చిరిగిపోయిన రూ.500 నోట్లను ఒక 20 తీసుకెళ్లారనుకుందాం. వాటి విలువ రూ.10,000. అంత మొత్తాన్ని ఒకేసారి మార్చుకోవడం కుదరదు. అలాంటప్పుడు బ్యాంకులు రూ.5,000 విలువ చేసే నోట్లను మాత్రమే ఎక్స్‌ఛేంజ్‌ చేస్తాయి. 

 

ఇది కూడా చదవండి: డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!  

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఎక్స్‌ఛేంజ్‌ రూల్స్‌.. అన్ని రకాల డ్యామేజ్డ్‌ నోట్ల రీప్లేస్‌మెంట్‌కు వీలు ఉండదు. దీనికి ఆర్‌బీఐ నిర్దిష్టమైన ప్రాసెస్ క్రియేట్‌ చేసింది. డ్యామేజ్‌ అయిన నోటుపై సీరియల్‌ నంబర్స్‌ ఉండాలి. మహాత్మా గాంధీ వాటర్‌ మార్క్‌ కనిపించాలి. గవర్నర్‌ సిగ్నేచర్‌ కూడా ఉండాలి. వీటిలో ఏవి లేకపోయినా ఆ నోటును స్వీకరించరు. 

 

నోటు కండిషన్ కూడా చాలా కీలకం. 78 స్క్వేర్‌ సెంటీమీటర్ల నోటు సరిగా ఉండి.. మిగిలినది డ్యామేజ్‌ అయితే ఆ నోటు విలువ మొత్తాన్ని ఇచ్చేస్తారు. ఒకవేళ 39 నుంచి 78 స్క్వేర్‌ సెంటీమీటర్ల నోటు మాత్రమే ఉంటే సగం విలువ చేసే మొత్తాన్ని అందజేస్తారు. 39 స్క్వేర్‌ సెంటీమీటర్ల కంటే తక్కువ ఉంటే మాత్రం దాన్ని ఎక్స్‌ఛేంజ్‌కు స్వీకరించరు. 

 

నోట్లను ఎక్స్‌ఛేంజ్‌ చేసుకోవాలి అనుకుంటే బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయదు. ఈ సర్వీసును ఉచితంగానే అందించాలని ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ చెబుతున్నాయి. పైగా డ్యామేజ్‌ అయిన నోట్లు ఇస్తున్న బ్యాంకులో మీకు అకౌంట్‌ ఉండాల్సిన అసవరం కూడా లేదు. పబ్లిక్‌ అయినా ప్రైవేట్‌ బ్యాంకు అయినా.. ఉచితంగా నోట్లను ఎక్స్‌ఛేంజ్‌ చేయాల్సిందే. 

 

ఎక్కువ నోట్లు ఇస్తే?.. ఒకసారి ఒక లిమిట్‌కు లోబడి మాత్రమే నోట్లను ఎక్స్‌ఛేంజ్‌ చేసుకునే వీలుంటుంది. ఉదాహరణకు రూ.5,000 కంటే ఎక్కువ విలువ చేసే డ్యామేజ్డ్‌ నోట్లను డిపాజిట్‌ చేస్తే వెంటనే నగదు మొత్తాన్ని రీప్లేస్ చేసి ఇవ్వరు. కాకపోతే మీరు తీసుకెళ్లిన అన్ని నోట్లను స్వీకరిస్తారు. రూ.5,000 వెంటనే ఇచ్చేసి మిగిలిన మొత్తాన్ని కొన్ని రోజుల తర్వాత బ్యాంకు అకౌంట్‌లో డిపాజిట్‌ చేస్తారు. ఒకవేళ అకౌంట్ లేకపోతే.. మీ వివరాలు తీసుకొని తర్వాత చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మోదీ - ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్‌కు భారీ షాక్! మరికొన్ని దేశాలకు కూడా..

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #India #Business #RBI #Cash #BankNotes #Currency